1990 వ దశకం లో బాల్యం
మనిషి పుట్టిన దగ్గర నుంచి 13-14ఏళ్ల ప్రాయం వచ్చేవరకు వుండే స్థితి ని బాల్యం అంటారు .ఒక మనిషి ప్రవర్తన అతని బాల్యం ఎలా గడిచిందో దాని మీద ఆధార పడుతుంది అనేది అందరికి తెలిసిందే .తొంభై వ దశకం లోపుట్టిన మా లాంటి వారికి ఉన్న అదృష్టం బహుసా ఇప్పటి స్మార్ట్ ఫోన్ జనరేషన్ పిల్లలకి లేదంటే అతిశయోక్తి కాదేమో,అదెలాగో తెలియాలా ఇహ చదవండి
మనిషి పుట్టిన దగ్గర నుంచి 13-14ఏళ్ల ప్రాయం వచ్చేవరకు వుండే స్థితి ని బాల్యం అంటారు .ఒక మనిషి ప్రవర్తన అతని బాల్యం ఎలా గడిచిందో దాని మీద ఆధార పడుతుంది అనేది అందరికి తెలిసిందే .తొంభై వ దశకం లోపుట్టిన మా లాంటి వారికి ఉన్న అదృష్టం బహుసా ఇప్పటి స్మార్ట్ ఫోన్ జనరేషన్ పిల్లలకి లేదంటే అతిశయోక్తి కాదేమో,అదెలాగో తెలియాలా ఇహ చదవండి
- నడుచుకుంటూ సైకిల్ లు తొక్కుకుంటు బియ్యం బస్తా లాంటి స్కూల్ బాగ్ లు తగిలించు కొని స్నేహితులతో గిల్లికజ్జాలా డుతూ వెళ్లడం మాకే చెల్లింది
- స్కూల్ గేటు దగ్గర అమ్మే పీచు మిఠాయిలు జామకాయలు ఊర బెట్టిన ఉసిరికాయలు మవిడికాయ్ ముక్కలు ఉప్పు కారం తో తిన్నా ఏనాడు అనారోగ్యం అనేది తెలియదు
- సాయంత్రం ఆరు గంటలైంది అంటే చాలు ఏదో డైలీ సీరియల్ లాగా ఎంచక్కా కరంట్ పోయేది ఇదే అదను పిల్లలంతా రోడ్ల మీద చేరి నేల బండ దొంగ పోలీస్ లాంటి ఆటల తో సమయం తెలిసేది కాదు ఇక కరెంట్ వచ్చాక మమ్మల్ని ఇంట్లో కి లాకెళ్ళ డానికి నానా అగచాట్లు పడేవారు
- ప్రతి ఇంటా సగటున ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల ఉన్నంత లో అన్ని పంచుకోవడం తో పాటు తో బుట్టువు ల తో గిల్లి కజ్జాలు దానితో బోర్ కొట్టడం అంటే ఏంటో తెలియదు
- చిన్న చిన్న బ్రిక్ వీడియో గేమ్స్,కంప్యూటర్ అనే పదం కొత్తగా నేర్చుకొని స్కూల్ లో కంప్యూటర్ సబ్జెక్ట్ పెట్టగానే మేమేదో మేధావి వర్గానికి చెందిన వాళ్ళలాగ ఇంట కుప్పి గెంతులు వేయడం మా తరానికి దొరికిన అరుదైన అవకాశం .ఇన్టుత విసిపి వీసీఆర్ నుంచి ఫ్లోపీ ,సీడీ, పెన్ డ్రైవ్ క్లౌడ్ టెక్నాలజి దాకా తెలుసుకున్నాము
- ఇంటొ అమ్మమ్మ లు నానమ్మ తాతయ్య లుదగ్గర కాశీ మజిలీ కథలు దగ్గర నుంచి వారి చిన్ననాటి విషయాల దాకా చెప్తుంటే వాళ్ళ చేతి ఆవకాయ అన్నం లో వెన్నపూస నంచుకుని మధ్యలో వారి కబుర్ల ని ఆల్చిప్ప లాగా కళ్ళు పెద్దవి చేసుకుని విని వాళ్ళ ని నానా ప్రశ్నలు అడిగి వారి తో చక్కని సమయం గడపడం మా తరానికి మరో వరం
- ఇంట్లో ఉన్న టీవీ లో ఒక్క దూరదర్శన్ మాత్రమే వచ్చే రోజుల్లో వారానికి ఒకసారి వేరే పాటల ప్రోగ్రాం చిత్రాలహరి కోసం వారం అంతా ఎదురు చూసే వారం ఇక ఆదివారం నాడు చార్లీ చాప్లిన్ ,లారెల్ హార్డ్ ,మాల్గుడి డేస్ , రామయణ, మహాభారత్ చూసేందుకు ఇంటిల్లి పాది టీవీ కి అత్తుకునే వాళ్ళం.కొత్త కొత్తగా కేబుల్ టీవీ కనెక్షన్ టీవీ లో సినిమాలు కొత్త ప్రోగ్రాములు ,ఇప్పుడు వెయ్యేసి చానెల్స్ ఉన్న ఒకటి సరిగా చూసే దిక్కు లేదు అప్పుడు ఉన్న కొద్దిపాటి చానెల్స్ ఎంతో ఇది గా చూసేవారం
- ఇంజనీరింగ్ కోర్సెస్ ఎంసెట్ పిచ్చి ని పిల్లల తో పాటు తల్లితండ్రులకి నర నరాల లో ఎక్కించి అమెరికా ఉద్యోగాలు ని భాగ్యనగరానికి తీసుకొచ్చి ఐటీ బీటీ అంటూ పరిచయం కొత్త ఆశలు చూపిస్తూ ఇంటర్ ఎంసెట్ నిర్బంధ విద్య లుగా తెలుగింటి కుటుంబీకులు అంట గట్టిన కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రారంభమైంది తొంభైవ దశకం లో
- ఎన్ని సమస్యలు వచ్చినా సర్దుకుపోవడం పడుతూనే లేవడం నేర్చుకోవడం పాత తరానికి ఈనాటి స్మార్ట్ ఫోన్ తరానికి వారధి గా నిలబడేది మా తరం
