ముచ్చటైన మనసు
ఈ మధ్యకాలం లో నేను చూసిన లఘు చిత్రాలలో నిజంగానే చాలా ముచ్చటగా ఉంది "మనసు "(manasu) చిత్రం .వీణ వేదిక(veenaa vedika) వారు తీసిన ఈ చిత్రం లో ప్రముఖ నటులు శ్రీ వంకాయల సత్యనారాయణ గారు ముఖ్య పాత్రధారి కాగా,మిగతా నటీనటులు అంతా కూడా ఇది వర లో కొన్ని లఘు చిత్రాలలో నటించినవారే .
లఘు చిత్రాలకి సాధారణ చలన చిత్రాలకి ఉన్నంత నిడివి ఉండదు ,సాధారణంగా 40 నిమిషాలు నుండి గంట సేపు లోపే వారు తెరకెక్కించాల్సిన అంశాలను టూకీగా చెప్పాలి .ఇలా వారు చెప్పదల్చుకున్న అంశాన్ని "మనసుకి " హత్తుకునేలా చెప్పడం లో దర్శకుడు శ్రీ త్రివిక్రమ్ గాజులపల్లి(Trivikram Gajulapalli) గారు విజయం సాదించారనడం లో ఎటువంటి సందేహం లేదు .
వార్ధక్యం లో భార్య కాలం చేయగా కొడుకు దగ్గర సమయం వెళ్ళబుచ్చుతుంటారు కృష్ణా రావు గారు ,ఒకరోజు ఆయన భార్య తాలూకు కాళీ మెట్టే అనుకోకుండా తారస పడుతుంది ,అప్పుడు జ్ఞాపకం వస్తుంది పెద్దాయనికి ఆ రోజు తన పెళ్లి రోజు అని,వెంటనే మనసు వుండబట్టక భార్యని జ్ఞాపకాలలో వెతుక్కొనేందుకు వారి స్వగ్రామం చేరుకుంటారు.
ఊరి లో తన బాల్యమిత్రుడు లక్ష్మీ తో తమ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ,ఇద్దరు చిన్నపిల్లల్లా పులి-మేక ఆదుకోవడం,మీసాలకు రంగులు దిద్దడం లాంటి సరదాగా కాలాన్ని గడపడమే కాక తన భార్య తో తన కు గల అనుబంధాన్ని ,ఆమె చనిపోయిన నాటి నుండి తాను మృత్యువు ని తలుచుకొని భయపడుతూ కాలాన్ని ఎలా గడుపుతున్నది చెప్పలేక చెప్పలేక తన స్నేహితుడికి చెప్పుకుంటారు కృష్ణా రావు గారు.
అది విన్న ఆయన స్నేహితుడు మృత్యువు అనేది అందరికి ఏదో ఒకనాడు చేరవలసిన దరి అని,అయితే దాని కోసం భయపడుతూ ఎప్పుడు చస్తూ బ్రతక కూడదని "బంధాల్ని తెంచుకొని పాశాలని తుంచుకొని శిశిరానికి శిరస్సు వంచి ఆకు వదలదా కొమ్మల్ని " అంటూ జీవిత సత్యాన్ని ఆయనకి గుర్తు చేస్తారు .అలా తన స్నేహితుని తో "మనసు" లో మాట పంచుకొని ,తేలికపడ్డ మనసుతో నిద్రకు ఉపక్రమించి అనుకోకుండా శాశ్వత నిద్ర లో కి జారుకుంటారు కృష్ణరావు .
అయితే బ్రతికినంత కాలం తమ ఊరిలో అందరికి తలలో నాలుకలా వుంటూ మంచి,చెడు చెప్పే పెద్దమనిషి కృష్ణారావు గారు తన ఊరికి ఏదైనా చేయాలన్న తపన పడుతుంటారు .ఆ విషయమే ఆయన తన పుస్తకంలో రాసుకుంటారు .ఆయన తదనంతరం ఆయన "మనసు" తెలుసుకున్న ఆయన కుమారుడు,స్నేహితుడు కృష్ణారావు గారి జ్ఞాపకార్ధం ఒక పాఠశాల నిర్మించి ఊరిలో లో అక్షరాస్యత ను పెంపొందించే దిశగా అడుగులు వేస్తారు.
దర్శకుడు తీసుకున్న అంశం సాధారణమైన వ్యక్తి జీవితమే అయినా "ముచత్తైన" మనసు అని ఎందుకని అన్నాను అంటే సహజంగా వార్ధక్యపు పడి లో ఉన్నవారి మనో భావాల్ని కళ్ళకి కట్టినట్టు ,గుండెలకి హత్తుకునేలా చాలా చక్కగా తెరకెక్కించారు. ఆ వయసులో వారు కోరుకునేది పిల్లలు వారితో సమయం గడపాలని,తమ మనసు తెలుసుకోవాలని ఇది చాలా చిన్న కొరికి లా కనిపించినా మారుతున్న జీవన క్రమం తరాల మధ్య అగాధలను ఏర్పరుస్తోందని దాని మీద "మనసు అనే ఆనకట్ట నిర్మించుకుంటేనే బంధాల్ని పదిలపరుచుకోవచ్చు అని సున్నితంగా సందేశాన్ని అందించారు.
మన ఆలోచనలన్నిటిని నిర్దారించగలిగేది మనసు,మనము దాని చేతిలో కీలు బొమ్మ కారాదని ,మన చేతలు మన ఆలోచనలు మనం పోయిన అజరామరంగా ఉండాలని ,ఇంతేకాక ఎంత కాలం బ్రతికాము అనే దాని కంటే ఎలా బ్రతికామనేది ముఖ్యం అనే నీతి ని చక్కగా చిత్రీకరించారు.
" మనసు " చిత్రం నాట వారి షార్ట్ ఫిల్మ్ విభాగం లో మొదటి బహుమతి పొందింది ,ఈ చిత్రం ఇచ్చిన అనుభవంతో దర్శకులు "కారందోస"(karam dosa) అనే చలన చిత్రం తెరకెక్కిస్తున్నారు.

No comments:
Post a Comment